📄 ePaper
Thursday, August 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇరుకోడులో అమ్మ అంబులెన్స్ ఘోర ప్రమాదం

ఇరుకోడులో అమ్మ అంబులెన్స్ ఘోర ప్రమాదం

📰 Generate e-Paper Clip

డివైడర్‌ను ఢీకొన్న ప్రైవేటు అంబులెన్స్ -డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
సిద్దిపేటనియోజకవర్గం//మనప్రజాప్రతినిధి//ఫిబ్రవరి3
సిద్దిపేట జిల్లా,సిద్దిపేట రూరల్ మండలం పరిధిలోని ఇరుకోడు గ్రామ శివారులో అమ్మ అంబులెన్స్ ఘోర ప్రమాదానికి గురైంది. సిద్దిపేట నుంచి దుబ్బాక వెళ్లే ప్రధాన రహదారిపై ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా జనగామ నియోజకవర్గానికి చెందిన అమ్మ అంబులెన్స్ డ్రైవర్ అరుణ్, సిద్దిపేటలోని సురక్ష హాస్పిటల్‌కు ఒక రోగిని తరలించి కిరాయి పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. అనంతరం దుబ్బాక నియోజకవర్గంలోని పోతారం గ్రామంలో ఉన్న తన బావ వద్దకు వెళ్తున్న సమయంలో, ఇరుకోడు సమీపంలో అంబులెన్స్ డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో డ్రైవర్ అరుణ్‌కు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.అదే సమయంలో ఇదే మార్గంలో సిద్దిపేట నుంచి దుబ్బాకకు వెళ్తున్న దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన 108 అంబులెన్స్ సిబ్బంది ప్రమాదాన్ని గమనించి వెంటనే ఆపారు. గాయపడిన డ్రైవర్‌కు ప్రాథమిక చికిత్స అందించి, స్థానికుల సహాయంతో దుబ్బాక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీస్ యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని రహదారిపై నిలిచిపోయిన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధ రించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.