📄 ePaper
Friday, October 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమర్పడగ క్షేత్రంలో హరీశ్‌రావు ప్రత్యేక పూజలు

మర్పడగ క్షేత్రంలో హరీశ్‌రావు ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

•ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు
ఆలయ మర్యాదలతో హరీశ్‌రావుకు ఘన సత్కారం

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.అక్టోబర్16
మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో సమస్త లోకాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, శాంతిసౌభాగ్యాలతో వర్ధిల్లాలని హరీశ్‌రావు భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.
అనంతరం క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథ్‌ శర్మ హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో శేషవస్త్రం అందజేసి సత్కరించారు.
హరీశ్‌రావు వెంట గజ్వేల్ బీఆర్‌ఎస్‌ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, రాజనర్సు, సంపత్‌రెడ్డి, అనంతుల ప్రశాంత్, నూనె కుమార్, రాగల దుర్గయ్య, నరసింహారెడ్డి, గ్రామ సర్పంచ్ ఆకారం బాలరాజు తదితరులు ఉన్నారు.
పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి పూజలు
అంతకుముందు గ్రామంలోని పోచమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనులకు హరీశ్‌రావు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.