📄 ePaper
Thursday, October 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుశాకాంబరీ దేవిగా దుర్గామాత దర్శనం

శాకాంబరీ దేవిగా దుర్గామాత దర్శనం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.అక్టోబర్15
మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు దుర్గామాత శాకాంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పాల హరినాథ శర్మ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి, అమ్మవారికి విశేష ఫలరస, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవానికి హాజరైన భక్తులకు ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.