📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుజీతాల బకాయిలు చెల్లించాలంటూ విధులను బహిష్కరించిన పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు

జీతాల బకాయిలు చెల్లించాలంటూ విధులను బహిష్కరించిన పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి06:
ఇల్లంతకుంట మండలంలోని మండల.గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు గత నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో తమ విధులను తాత్కాలికంగా బహిష్కరించారు. ఈ మేరకు ఎంపీడీవో మరియు మండల పంచాయతీ అధికారికి వినతి పత్రం సమర్పించినట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా ఆపరేటర్లు మాట్లాడుతూ, నెలల తరబడి జీతాలు అందకపోవడం వల్ల కుటుంబ పోషణ కష్టంగా మారిందని, తక్షణమే పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని.సంబంధిత అధికారులను కోరారు. జీతాలు చెల్లించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ధనుజ్ కుమార్, రమేష్, నరేష్, చంద్రశేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular