Wednesday, February 11, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుజయప్రకాశ్ నగర్‌లో‘కమలం’జోరు?

జయప్రకాశ్ నగర్‌లో‘కమలం’జోరు?

📰 Generate e-Paper Clip

•24వ వార్డులోబీజేపీఅభ్యర్థి”గుంటుకమంజులప్రచారం వేగం-ఓటర్లలో మారుతున్న రాజకీయ ధోరణులు

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి8:
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ జయప్రకాశ్ నగర్ 24వ వార్డులో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈసారి వార్డు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు సూచిస్తున్నాయి.మొట్టమొదటిసారిగా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి గుంటుక మంజుల కోటేశ్వర్కు ఓటర్ల నుంచి పెరుగుతు న్నఆదరణస్పష్టంగాకనిపిస్తున్నట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.
కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం అందించిన ఉచిత రేషన్ బియ్యం వంటి పథకాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ప్రభావం కొంతమంది ఓటర్లలో బీజేపీపై సానుకూల అభిప్రాయాన్ని పెంచినట్లు తెలుస్తోంది. “గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే పాలన” అనే నినాదం ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా మారింది.అభ్యర్థి మంజుల గడపగడప కు తిరుగుతూ ముమ్మర ప్రచారం నిర్వహిస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇస్తున్నారు.“డబ్బుకోసం కాదు… ప్రజల సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను. మీ ఆశీర్వాదం లభిస్తే అభివృద్ధిని మీ ఇంటి ముంగిటకు తీసుకువస్తాను” అని ఆమె పేర్కొన్నారు.ప్రచారానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో,జయప్రకాశ్ నగర్ 24వ వార్డు ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular