📄 ePaper
Wednesday, July 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుచేర్యాల నాలుగో వార్డులో బీఆర్‌ఎస్ ఇంటింటి ప్రచారం జోరు

చేర్యాల నాలుగో వార్డులో బీఆర్‌ఎస్ ఇంటింటి ప్రచారం జోరు

📰 Generate e-Paper Clip

శ్రీనగర్ కాలనీలో అభ్యర్థి నిమ్మ సుప్రజకు ప్రజల నుంచి మంచి స్పందన
మనప్రజాప్రతినిధి//చేర్యాల,ఫిబ్రవరి8:
చేర్యాల మున్సిపాలిటీ నాలుగో వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఆదివారం శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నిమ్మ సుప్రజ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాజీవ్ కుమార్ రెడ్డి, సిద్ధిపేట బీఆర్‌ఎస్ నాయకులు రాహుల్ రెడ్డి,నాగరాజు గౌడ్, అనిల్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొని అభ్యర్థికి మద్దతుగా విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించినట్లు నాయకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular