📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువిద్యార్థులు మత్తు పదార్థాలకు, సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి: రూరల్ ఎస్ఐ డి.నవత

విద్యార్థులు మత్తు పదార్థాలకు, సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి: రూరల్ ఎస్ఐ డి.నవత

📰 Generate e-Paper Clip

•వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించిన రూరల్ పోలీసులు ఎస్ఐ డి.నవత
•ఈగల్ ఫోర్స్ తెలంగాణ పోర్టల్‌కు ఏడాది పూర్తి సందర్భంగా అవగాహన కార్యక్రమం – ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దని సూచన

సిద్దిపేట రూరల్ మండల పోలీస్ స్టేషన్‌లో నూతన సబ్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రూరల్ ఎస్ఐ డి. నవత తమ విధుల్లో భాగంగా ఇర్కోడ్ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ డి. నవత మాట్లాడుతూ, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తమ బంగారు భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, క్రమశిక్షణతో ముందుకు సాగాలని తెలిపారు. సందర్భంగా ఎస్ఐ డి. నవత మాట్లాడుతూ, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా తమ బంగారు భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, క్రమశిక్షణతో ముందుకు సాగాలని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈగల్ ఫోర్స్ తెలంగాణ పోర్టల్ నేటితో విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సమాజంలో మత్తు పదార్థాల నిర్మూలనతో పాటు సైబర్ నేరాల నివారణకు ఈ పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.అలాగే విద్యార్థులు, ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు నంబర్లు, పాస్‌వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు.మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగం లేదా ఇతర అక్రమకార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫిర్యాదు చేయాలని, అలాగే ఈగల్ ఫోర్స్ తెలంగాణ పోర్టల్ లేదా వాట్సాప్ గ్రూప్ 8712671111 ద్వారా ఫోటోలు, సందేశాలు పంపి పోలీసులకు సహకరించాలని కోరారు.అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, సందేశాలకు స్పందించకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, తమ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇర్కోడ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.