📄 ePaper
Wednesday, July 15, 2026
Homeతెలంగాణధాన్యం అక్రమ రవాణాకు నియంత్రణకు  చెక్ పోస్ట్ పౌర సరఫరాల శాఖ డిటి విజయ్ బాబు

ధాన్యం అక్రమ రవాణాకు నియంత్రణకు  చెక్ పోస్ట్ పౌర సరఫరాల శాఖ డిటి విజయ్ బాబు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//ముదిగోండ, నవంబర్ 15,:

ఆంధ్రప్రదేశ్  నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా ధాన్యం రవాణా కాకుండా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని పౌర సరఫరాల శాఖ డిటి విజయ్ బాబు తెలిపారు.శనివారం పౌర సరఫరాల శాఖ డిటి విజయ్ ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ డిటి విజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రవాణా జరుగుతుందని, దీనిని అరికట్టేందుకు జిల్లా సరిహద్దు వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని  అన్నారు.ఏపీ నుంచి అక్రమంగా ధాన్యం రవాణా చేయడానికి వీలు లేదని, 24 గంటల పాటు అధికారులు చెక్ పోస్ట్ వద్ద కాపలా కాస్తున్నారని, అక్రమంగా ధాన్యం రవాణా చేస్తే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనం, ధాన్యం సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular