📄 ePaper
Saturday, August 22, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅక్బర్‌పేట భూంపల్లి తహసీల్దార్ కార్యాలయ భవనానికి రూ.2.25 కోట్ల నిధులు మంజూరు.

అక్బర్‌పేట భూంపల్లి తహసీల్దార్ కార్యాలయ భవనానికి రూ.2.25 కోట్ల నిధులు మంజూరు.

📰 Generate e-Paper Clip

°శాశ్వత తహసీల్దార్ కార్యాలయ భవనంతో రెవెన్యూ సేవలకు ఊతం

°గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: పాతూరి వెంకటస్వామి గౌడ్

°మండల ప్రజల చిరకాల కల సాకారం – కాంగ్రెస్ ప్రభుత్వానికి, చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన పాతూరి వెంకటస్వామి గౌడ్
మనప్రజాప్రతినిధి//దుబ్బాకనియోజకవర్గం,సిద్దిపేటజిల్లా:జూన్28
అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.2.25 కోట్ల నిధులను మంజూరు చేయడంతో మండల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ, మండల ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరే దిశగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు.
మండలానికి శాశ్వత తహసీల్దార్ కార్యాలయ భవనం అవసరమనే ప్రజల చిరకాల డిమాండ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆధునిక వసతులతో నిర్మించనున్న ఈ భవనం ద్వారా రెవెన్యూ సేవలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ నిధులను మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళా & శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి సీతక్క, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం & సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా, మండల ప్రజల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు నిరంతరం కృషి చేసిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, రానున్న రోజుల్లో మండలానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చేందుకు కృషి కొనసాగుతుందని పాతూరి వెంకటస్వామి గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు నీల ప్రభాకర్, అన్నబోయిన చంద్రశేఖర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కూతురు కుమారస్వామి, మాజీ దుబ్బాక ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మంద చంద్రసాగర్, మాజీ ఎంపీటీసీ పాతూరి శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచులు జీడిపల్లి రమేష్, రామగల్ల స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోరంద రవీందర్ రెడ్డి, బాల్తే వెంకటేశం, ఉత్తం నరేష్, ఎల్లన్నగారి సురేందర్ రెడ్డి, పోతారం రాజు, వెలుపుల యాదయ్య ముదిరాజ్, మహమ్మద్ సాదిక్, కడవెరుగు జగన్, మధుగని వెంకట్ యాదవ్, కడవెరుగు నగేష్, బండి స్వామి గౌడ్, కూతురు స్వామి, పాతూరి ప్రదీప్ రెడ్డి, పాతూరి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.