📄 ePaper
Wednesday, July 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపెన్‌పహాడ్ ఎస్సై బాలు నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగేశ్వరరావు

పెన్‌పహాడ్ ఎస్సై బాలు నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగేశ్వరరావు

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి//పెన్‌పహాడ్, సూర్యాపేట జిల్లా:

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల ఎస్సై బాలు నాయక్‌ను  నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై వారు చర్చించారు.
నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీసులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు. ప్రజలకు న్యాయం చేయడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. మండల ప్రజలకు అన్ని విధాలుగా సహకారం అందించి, చట్టబద్ధమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఎస్సై బాలు నాయక్ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నారని నాగేశ్వరరావు అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular