📄 ePaper
Wednesday, July 15, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురెండోసారి రంగదాంపల్లి యాదవ సంఘం అధ్యక్షుడిగా సాయికుమార్ యాదవ్

రెండోసారి రంగదాంపల్లి యాదవ సంఘం అధ్యక్షుడిగా సాయికుమార్ యాదవ్

📰 Generate e-Paper Clip

“యాదవుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.. సభ్యుల సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తాం” – సాయికుమార్ యాదవ్.

°రంగదాంపల్లి యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక
°అధ్యక్షుడిగా సాయికుమార్ యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక – సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జూలై15
సిద్దిపేట పట్టణంలోని మూడో వార్డు రంగదాంపల్లి యాదవ సంఘం నూతన కమిటీని బుధవారం సంఘ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా సాయికుమార్ యాదవ్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నూతన కమిటీలో ఉపాధ్యక్షుడిగా బత్తుల పరశురాములు, ప్రధాన కార్యదర్శిగా జంపల్లి సత్యనారాయణ, కార్యదర్శులుగా మామిండ్ల మల్లేశం, చింతల నవీన్, ఖజాంచిగా జంపల్లి మల్లేశం ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కొండయ్య, చంద్రయ్య, మోహన్, భూమయ్య, మల్లేశం, సంపత్, దేవరాజ్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సాయికుమార్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యాదవులకు ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా సంఘం తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి అందేలా చర్యలు తీసుకుంటానని, యాదవ సంఘం అభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular