మనప్రజాప్రతినిధి
అక్బర్ పేట్ భూంపల్లి మండల్
సిద్దిపేట జిల్లా.
మండల పరిధిలో
పోతారెడ్డిపేట లో
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ..
అక్బర్పేట–భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.
ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించి, పోతారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణ పనులకు, రైతు వేదిక ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
అనంతరం ఇటీవల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థులతో పాటు పీఈటీ ప్రవీణ్ గారిని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.
ఘనంగా సన్మానించి అభినందించారు. విద్యార్థులు క్రీడా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్య, క్రీడా రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, గ్రామస్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పోతారెడ్డిపేట గ్రామం అభివృద్ధికి మరో ముందడుగు..
RELATED ARTICLES



