📄 ePaper
Wednesday, October 7, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపారిశుధ్య కార్మికుడి కుటుంబానికి గ్రామ పంచాయతీ సిబ్బంది అండ.

పారిశుధ్య కార్మికుడి కుటుంబానికి గ్రామ పంచాయతీ సిబ్బంది అండ.

📰 Generate e-Paper Clip

“మృతుడు బాలరాజ్ కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం అందజేత
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.అక్టోబర్7
ఇటీవల మృతి చెందిన ఇర్కోడ్ గ్రామ పారిశుధ్య కార్మికుడు తాటిగాని బాలరాజ్ కుటుంబానికి గ్రామ పంచాయతీ అండగా నిలిచింది. బాలరాజ్ కుటుంబాన్ని సర్పంచ్ ఘణపురం కృష్ణతో పాటు పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ సందర్భంగా కుటుంబానికి ఆర్థిక సహాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో సర్పంచ్ ఘణపురం కృష్ణ, కారోబారి శాప ఎల్లం, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, మోటార్ మెకానిక్ మల్లారెడ్డి, పారిశుధ్య కార్మికులు జి. రాజు, అనిత, లావణ్య, ఉషిగాని ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.