📄 ePaper
Wednesday, October 7, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుపచ్చదనమే ప్రగతికి ప్రతీక

పచ్చదనమే ప్రగతికి ప్రతీక

📰 Generate e-Paper Clip

“తోర్నాలలో ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటరూరల్.అక్టోబర్7
పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామంలో మంగళవారం సాయంత్రం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు అన్నసరం సురేష్ గౌడ్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ ఎంపీడీఓ, చిన్నకొడూరు మండల అధ్యక్షుడు సురగోని శేఖర్ గౌడ్, నారాయణరావుపేట మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సిద్దిపేట పట్టణ నాయకులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు వసూరి మహేష్, బూత్ అధ్యక్షుడు కనకట్ల నరేష్, ఒగ్గు బాలరాజు, వీఓ లీడర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.