📄 ePaper
Saturday, November 28, 2026
Homeతెలంగాణపాఠశాల అభివృద్ధికి రూ.1.20 లక్షల విరాళం

పాఠశాల అభివృద్ధికి రూ.1.20 లక్షల విరాళం

📰 Generate e-Paper Clip

దాతృత్వాన్ని చాటుకున్న రావులపల్లి ప్రసాద్  అరుణ దంపతులు

నేరేడుచర్ల: (మన ప్రజాప్రతినిధి దినపత్రిక )

నేరేడుచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కోరగానే స్పందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త రావులపల్లి ప్రసాద్, అరుణ దంపతులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పాఠశాల అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.1,20,000 విలువైన రంగులు వేయించడం, మరమ్మతు పనులకు అవసరమైన ఖర్చులను భరించి తమ ఉదారతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఒకప్పుడు నేరేడుచర్లలో వ్యాపారం నిర్వహిస్తూ ఇక్కడి ప్రజలతో అనుబంధం పెంచుకున్న రావులపల్లి ప్రసాద్ దంపతులు, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పటికీ నేరేడుచర్లపై ఉన్న మమకారాన్ని మరువకుండా పాఠశాల అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని పలువురు కొనియాడారు.
ప్రస్తుత సమాజంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు దాతలు ముందుకు రావడం అవసరమని, నేరేడుచర్లలోని దశాబ్దాల కాలం నాటి పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైన రావులపల్లి ప్రసాద్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.
wzsqఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలు చల్లా వెంకటేశ్వర్లు, యారవ లక్ష్మి, విజయమాధురి, శ్రీకాంత్, మాజి సర్పంచ్ కొణతం సత్యనారాయణ రెడ్డి, చలసాని శ్రీనివాసరావు, రాచకొండ రామన్న, మండల ఎంటీఎస్ బాలునాయక్, జిల్లా పరిషత్ పాఠశాల హెడ్‌మాస్టర్ బట్టు మధు, కొనేటి సీతారాం రెడ్డి, సత్యనారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.