📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు161వ జాతీయ రహదారిపై మృత్యుఘాతం

161వ జాతీయ రహదారిపై మృత్యుఘాతం

📰 Generate e-Paper Clip

•అతివేగంతో దూసుకెళ్లిన కారు బోల్తా-యువకుడికి స్పాట్‌డెత్ మెదక్.మనప్రజాప్రతినిధి//జనవరి17
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామ పరిధిలోని 161వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌తో దూసుకెళ్లిన కారు అదుపుతప్పి రోడ్డు కిందికి బోల్తా పడటంతో కారులో ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ వైపు అతివేగంగా వెళ్తున్న కారు ప్రమాదానికి గురై పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే సంఘటనా స్థలమే మృత్యు స్థలంగా మారింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అల్లాదుర్గం పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏఎస్ఐ గాలయ్య వివరాలు సేకరించారు. మృతుడిని *గుడిపల్లి శ్రీధర్ రెడ్డి (30)గా గుర్తించారు. ఆయన హస్నాపూర్ గ్రామం, పిట్లం మండలం, కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular