📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుక్రిప్టోపేరుతో ప్రజల రక్తం పీల్చిన ముఠా!

క్రిప్టోపేరుతో ప్రజల రక్తం పీల్చిన ముఠా!

📰 Generate e-Paper Clip

•‘ఈగల్ కాయిన్’మాయలో కోట్ల దోపిడీ-సిరిసిల్లలో నలుగురు అరెస్ట్
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి04
అధిక లాభాల ఎర వేసి అమాయక ప్రజలను నిలువునా ముంచిన క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది. ‘ఈగల్ కాయిన్’ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ ముసుగులో కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన ముఠాను సిరిసిల్ల పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించా రు.చైన్ సిస్టమ్ పేరిట పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే కోటీశ్వరులవుతారని నమ్మబలికి ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన నిందితులు, చివరికి చేతులెత్తేశారు. బాధితులు నిలదీయగానే మాట దాటవేసి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో అసలు బండారం బయటపడింది.11 లక్షల పెట్టుబడికి 30 లక్షలు వస్తాయని ఆశ చూపి, కేవలం 1.20 లక్షలు మాత్రమే ఇచ్చి మోసం చేసిన ఘటనతో ఈ ‘క్రిప్టో మాయ’ ఎంత ఘోరమో బయటపడింది.
నిందితుల నుంచి స్వాధీనం:
▪️ 3 ఖరీదైన కియా సోనెట్ కార్లు
▪️ 4 స్మార్ట్ ఫోన్లు
పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
పోలీసుల హెచ్చరిక:
ఆన్‌లైన్ కంపెనీలు, క్రిప్టో కరెన్సీ, మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో వచ్చే మాయమాటలను నమ్మి మోసపోవద్దని, బాధితులు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని ఇన్‌స్పెక్టర్ కృష్ణ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular