📄 ePaper
Sunday, July 26, 2026
Homeఆంధ్రప్రదేశ్జాతీయ ఖో–ఖోకు పాంగూరు బిడ్డ… జెడ్‌పి హై స్కూల్ విద్యార్థిని అమృత సత్తా!

జాతీయ ఖో–ఖోకు పాంగూరు బిడ్డ… జెడ్‌పి హై స్కూల్ విద్యార్థిని అమృత సత్తా!

📰 Generate e-Paper Clip

•తల్లిదండ్రుల సహకారం-ఉపాధ్యాయుల ప్రోత్సాహం – కఠిన సాధన ఫలితం

గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయికి…ఖో–ఖోలో అమృత అద్భుత ఎంపిక
•కాజీపేట జాతీయ ఖో–ఖోలో పాంగూరు విద్యార్థిని అమృత జెండా!
ఖో–ఖోలో చరిత్ర సృష్టించిన పాంగూరు అమ్మాయి అమృత.

తిరుపతిజిల్లా.ఏర్పేడు మండలం..పాంగూరు,జనవరి19(మనప్రజాప్రతినిధి):
జెడ్‌పి హై స్కూల్ పాంగూరు పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని సి. అమృత జాతీయ సీనియర్ ఖో–ఖో పోటీలకు ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది. ఈ జాతీయ స్థాయి ఖో–ఖో పోటీలు ఈ నెల 11-01-2026 నుండి 15-01-2026 వరకు కాజీపేట రైల్వే స్టేడియంలో, తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించను న్నారు.అమృత తండ్రి జగన్నాథ్ రెడ్డి, తల్లి జయంతి తమ కుమార్తె ఈ స్థాయికి చేరుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. క్రీడలతోపాటు చదువుల్లోనూ ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయికి ఎదగడం ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల హెడ్‌మాస్టర్ నాజర్ హుసేన్, ఉపాధ్యాయులు అమృతను ఘనంగా అభినందించారు. కఠిన సాధన, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని వారు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular