📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకొండూరు రవీందర్ రావుకు ఘన రాజకీయ ఆత్మీయ వీడ్కోలు

కొండూరు రవీందర్ రావుకు ఘన రాజకీయ ఆత్మీయ వీడ్కోలు

📰 Generate e-Paper Clip

సహకార రంగానికి బీఆర్ఎస్ ఇచ్చిన దిశానిర్దేశానికి ప్రతీక-చల్మెడ లక్ష్మీనరసింహారావు
మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.డిసెంబర్27
కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌గా రెండు దశాబ్దాలపాటు సేవలందిస్తూ సహకార రంగంలో రాజకీయ స్థిరత్వం, పరిపాలనా పటిష్టతకు బలమైన పునాది వేసిన కొండూరు రవీందర్ రావు గారికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన రాజకీయ ఆత్మీయ వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞతా సభకు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు హాజరై, రవీందర్ రావు గారి సేవలను పార్టీ స్థాయిలో కొనియాడారు.బీఆర్ఎస్ పాలనలో సహకార రంగానికి వచ్చిన బలం, రైతులకు లభించిన భరోసా-ఇవన్నీ రవీందర్ రావు గారి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.బీఆర్ఎస్ రాజకీయ తత్వానికి నిలువెత్తు రూపం.రైతు కేంద్రంగా రాజకీయ నిర్ణయాలు తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా రవీందర్ రావు గారు పని చేశారని చల్మెడ లక్ష్మీనరసింహారావు స్పష్టం చేశారు.
సహకార బ్యాంకుల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చడంలో ఆయన పాత్ర కీలకమని తెలిపారు.ఈ సందర్భంగా రవీందర్ రావు గారిని శాలువాతో సత్కరించి, పార్టీ తరపున ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ సభ బీఆర్ఎస్‌లో నాయకుల పట్ల ఉన్న గౌరవం, క్రమశిక్షణ, రాజకీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సహకార రంగ ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ ఐక్యతను చాటారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular