📄 ePaper
Tuesday, July 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురైతులకు ఊపిరి పోసిన చర్య-ఫీడర్ -కెనాల్‌లో పూడిక తొలగింపు

రైతులకు ఊపిరి పోసిన చర్య-ఫీడర్ -కెనాల్‌లో పూడిక తొలగింపు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి16:
ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామంలో రైతుల నీటి సమస్యల పరిష్కారానికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో కీలక చర్యలు చేపట్టారు. గ్రామానికి నీరు సరఫరా అయ్యే ఫీడర్ కెనాల్‌లో పేరుకుపోయిన పూడికను జేసీపీ యంత్రంతో తొలగించారు.
ఫీడర్ కెనాల్‌లో పూడిక పేరుకుపోవడంతో యాసంగి పంటలకు నీరు సకాలంలో చేరక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గ్రామస్థుల దృష్టికి వచ్చింది. రైతుల అభ్యర్థన మేరకు వెంటనే స్పందించిన గ్రామ పంచాయతీ, పూడిక తొలగింపు పనులను చేపట్టి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంది.ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ – “రైతులకు నీటి సమస్యలు లేకుండా చూడటం మా ప్రధాన ధ్యేయం. యాసంగి పంటలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నీరు అందేలా నిరంతరం చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూస రవి, కుషాల్ అంజయ్య, ఏనుగుల మహేందర్, గడ్డమీది మహేష్, పొనగంటి రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular