📄 ePaper
Sunday, July 26, 2026
Homeఆంధ్రప్రదేశ్బత్తినయ్య కోనలో చిక్కుకున్న భక్తుల రక్షణకు అధికారులు రంగంలోకి

బత్తినయ్య కోనలో చిక్కుకున్న భక్తుల రక్షణకు అధికారులు రంగంలోకి

📰 Generate e-Paper Clip

భక్తుల సురక్షితాన్ని నిర్ధారించాలంటూ తలపా దామోదరం రెడ్డి ఆదేశాలు.
మనప్రజాప్రతినిధిఏర్పేడు మండలం.డిసెంబర్ 2
ఏర్పేడు మండలం ముసిలిపేడు గ్రామం సమీపంలోని బత్తినయ్య కోనకు వెళ్లిన భక్తులు వరద నీరు అకస్మాత్తుగా పెరగడంతో అడవి ప్రాంతంలో చిక్కుకుపోయిన ఘటనపై అధికారులు వెంటనే చర్యలు మొదలుపెట్టారు. భక్తులను సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు సంబంధిత విభాగాలు సమన్వయంతో రక్షణ చర్యలను చేపట్టాయి.
పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్న తలపా దామోదరం రెడ్డి, ఎమ్మార్వో ఏ. భార్గవి, ఎంపీడీవో డాక్టర్ సౌభాగ్యంతో కలిసి స్థల పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ,
“భక్తులందరూ క్షేమంగా తిరిగి రావడం మా ప్రధాన లక్ష్యం. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేయాలి” అని సూచించారు.
ఈకార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షుడు ఆంటోనీ, అలాగే అరుణ్, అజిత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular