📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు“12వ వార్డులో కాంగ్రెస్ జోరు-మమత గెలుపుకోసం పులిమామిడి రాజు విస్తృత ప్రచారం”

“12వ వార్డులో కాంగ్రెస్ జోరు-మమత గెలుపుకోసం పులిమామిడి రాజు విస్తృత ప్రచారం”

📰 Generate e-Paper Clip

భార్య గెలుపు కోసం గడపగడప ప్రచారం-పులిమామిడి రాజు కృషి
కాంగ్రెస్ అభ్యర్థి పులిమామిడి మమతకు భారీ మెజారిటీ ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి
సదాశివపేట,ఫిబ్రవరి7(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత పక్షాన ఆమె భర్త పులిమామిడి రాజు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో 12వ వార్డు ఇంచార్జ్ వడ్ల బింబాధర్ చారి, వార్డు ప్రజలు, పిఎంఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, ఖర్చర్ల హరీష్, అఖిల్, గుణాకర్, సుభాష్, మాణిక్యం, పరమదాసు, జగన్నాథం, నరేష్, వినయ్, వెంకటేశం, మనోజ్, అంజనేయులు గౌడ్, శ్రీనివాస్, మాలె శ్రీను, చీలం సురేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళలు మాధవి, శశికళ, రాణి, పద్మ ఇతరులు కూడా ప్రచారంలో పాల్గొని మమతకు మద్దతు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular