📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణమున్సిపల్ బరిలో సిపిఐ అభ్యర్థుల పోటీ

మున్సిపల్ బరిలో సిపిఐ అభ్యర్థుల పోటీ

📰 Generate e-Paper Clip

నేరేడుచర్ల( మనప్రజాప్రతినిధి) జనవరి28

నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల్లో మూడు వార్డుల్లో సిపిఐ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రకటించారు బుధవారం నాడు నేరేడుచర్ల పట్టణ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..పట్టణంలో ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా ముందుగా స్పందించేది సిపిఐ పార్టీ అని
ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజల కొరకు పనిచేసే పార్టీ సిపిఐ అని ముఖ్యంగా కార్మిక వర్గ శ్రేయస్సు కోసం వారి హక్కుల కోసం విద్యార్థుల యువజన మహిళా హక్కుల కోసం ఇంటి స్థలాల సమస్య పైన రేషన్ కార్డుల సమస్య పైన రైతాంగం ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర కొరకు అనేక ధర్నాలు రాస్తారోకోలు ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర సిపిఐ పార్టీది అని ఆయన గుర్తు చేశారు పట్టణంలోని 12వ వార్డు నుంచి నేరేడుచర్ల ప్రాంత పార్టీ నిర్మాణ బాధ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు ఆరో వార్డు నుంచి మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ A లక్ష్మి, ఎనిమిదవ వార్డు నుంచి ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను సతీమణి జానకి ని బరిలో నిలపనున్నట్లు ఆయన తెలిపారు సమావేశంలోమహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ A లక్ష్మి, ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను ఏఐటీయూసీ మండలాధ్యక్షుడు ఊదర వెంకన్న బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు పరికె భరత్, బీసీ హక్కుల సాధన సమితి పట్టణ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular