📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలునూతన సర్పంచ్, ఉప సర్పంచ్‌కు శాలువాలతో సన్మానం చేసిన దేవభూషణం.

నూతన సర్పంచ్, ఉప సర్పంచ్‌కు శాలువాలతో సన్మానం చేసిన దేవభూషణం.

📰 Generate e-Paper Clip

మెదక్,డిసెంబర్28(మనప్రజాప్రతినిధి)
ముస్లాపూర్ గ్రామానికి నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం రోజున ఎంజీఎస్ గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంజీఎస్ గార్డెన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ దేవ భూషణం, నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పడిగె జ్యోతి, ఉప సర్పంచ్ రమేష్‌తో పాటు పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా దేవ భూషణం మాట్లాడుతూ, ముస్లాపూర్ గ్రామాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి పాలకవర్గం చిత్తశుద్ధితో పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular