📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇల్లంతకుంట మండలంలో పలు గ్రామాల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

ఇల్లంతకుంట మండలంలో పలు గ్రామాల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్22
ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామపంచాయతీల నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రసమయి బాలకిషన్, గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండాలని కోరారు.
గెలుపొందిన గ్రామ సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు, అలాగే ప్రజలందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు–ప్రజలు కలిసికట్టుగా పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నరసింహ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular