📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅక్బర్‌పేటనుఆదర్శగ్రామంగాతీర్చిదిద్దుతానుసర్పంచ్ అభ్యర్థి కూతురు కుమార స్వామి

అక్బర్‌పేటనుఆదర్శగ్రామంగాతీర్చిదిద్దుతానుసర్పంచ్ అభ్యర్థి కూతురు కుమార స్వామి

📰 Generate e-Paper Clip

అక్బర్ పేటభూంపల్లి మండలం, దుబ్బాక నియోజకవర్గం (మనప్రజాప్రతినిధి)డిసెంబర్10
అక్బర్ పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్న కూతురు కుమార స్వామి బుధవారం గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలతో మాట్లాడుతూ అక్బర్ పేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా నిలపడం తన లక్ష్యమని తెలిపారు.గ్రామంలో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయని తెలిపారు. అధికారులతో చర్చించి ప్రతి సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు చెప్పని ఏ పనినీ ప్రారంభించబోనని, పారదర్శకమైన పరిపాలన అందిస్తానని తెలిపారు.అభ్యర్థి ప్రధాన హామీలురైతుల కోసం ప్రభుత్వ స్థలంలో ధాన్యం ఆరబెట్టే యార్డ్ ఏర్పాటుఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం మరియు ఇల్లు నిర్మాణంగ్రామంలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల విస్తరణ ప్రభుత్వ స్థలంలో మినీ ఫంక్షన్ హాల్, షాదీ ముబారక్ హాల్ ఏర్పాటు యువత కోసం క్రికెట్, వాలీబాల్ గ్రౌండ్ – మినీ స్టేడియంఅసంపూర్తిగా ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు పూర్తిఅంగన్వాడి కేంద్రాలు, గ్రంథా లయం, చిల్డ్రన్స్ పార్క్ స్థాపనసొంత ఖర్చుతో సావిత్రి జ్యోతి రావు ఫూలే విగ్రహం ఏర్పాటుమహిళా సంఘాల బలోపేతం, స్థానిక పరిశ్ర మల ద్వారా ఉపాధి అవకాశాల కల్పనకూతురు కుమార స్వామి మాట్లాడుతూ“పాలకుడిగా కాదు… సేవకుడిగా పనిచేస్తాను. అబద్ధాలు కాదు… అభివృద్ధి చేసి చూపిస్తాను. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపో యినా ప్రజా సంక్షేమాన్ని ఎన్నడూ విస్మరించలేదు. గ్రామమే దేవాల యం,ప్రజలే దేవుళ్లు” అని భావోద్వేగంతో అన్నారు.ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి ఆలోచించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి సమర్థ అభ్యర్థిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular