📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా

📰 Generate e-Paper Clip

సర్పంచ్ అభ్యర్థి బత్తిని కావ్య శ్రీ హామీ
మనప్రజాప్రతినిధి//ఇల్లంతకుంటమండలం//మనకొండూరు నియోజకవర్గం,డిసెంబర్ 12:
రహీమ్ ఖాన్‌పేట్ గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న బత్తిని కావ్య శ్రీ నేడు ప్రజలతో మాట్లాడుతూ గ్రామ సమగ్ర అభివృద్ధినే తన లక్ష్యంగా పని చేస్తానని పేర్కొన్నారు.ఎన్నికల సంఘం కేటాయించిన క్రమ సంఖ్య–2, కత్తెర గుర్తుకు ఓటేయాలని గ్రామ ప్రజలను ఆమె అభ్యర్థించారు.గ్రామ అభివృద్ధిపై చేపట్టబోయే చర్యలను వివరించిన ఆమె“గ్రామంలోని మోరీల పునర్నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. గ్రామ భద్రతను దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాల ఏర్పాటు నా ప్రాధాన్యత. ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తాను” అని అన్నారు.అన్ని కుల సంఘాల మద్దతు కోరుతూ“ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తాను. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించాలని కోరుతున్నాను” అని పేర్కొన్నారు.“మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుకే వేసి నాకు విశేష మెజారిటీ ఇవ్వండి” అని ఆమె గ్రామ ప్రజలను అభ్యర్థించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular