📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు“ఆశీర్వదిస్తే ఐదేళ్లు మీ కళ్లముందే సేవలు”

“ఆశీర్వదిస్తే ఐదేళ్లు మీ కళ్లముందే సేవలు”

📰 Generate e-Paper Clip

పేదల అభివృద్ధే లక్ష్యం-ఇళ్ల స్థలాలు,సీసీ రోడ్లు,పింఛన్ల హామీ: నాగుల మాణెమ్మ
మనప్రజాప్రతినిధి//సదాశివపేట,ఫిబ్రవరి6
సదాశివపేట 6వ వార్డు కృష్ణానగర్ కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి నాగుల మాణెమ్మ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ, తనను ఆశీర్వదించి గెలిపిస్తే ఐదేళ్లు ప్రజల మధ్యే ఉండి 24 గంటలు సేవలందిస్తానని ఆమె హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడబోమని,అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామ ని తెలిపారు. గల్లీ గల్లీలో కొత్త సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తామని, త్రాగునీరు మరియు పారిశుద్ధ్య సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పారు.రాజకీయాల్లో డబ్బుకి కాకుండా ప్రజాసేవకు ప్రాధాన్యం ఇచ్చి ఓటు వేయాలని కోరిన నాగుల మాణెమ్మ, తాను గెలిస్తే ఆరవ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. మహిళలు, నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక కార్యచరణ చేపడతామని, ప్రజల సమస్యల పరిష్కారానికి తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular