📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఎన్నికల సమయంలో చెక్‌పోస్టుల్లో అప్రమత్తత పెంచండి – జిల్లా ఎస్పీ ఆదేశాలు

ఎన్నికల సమయంలో చెక్‌పోస్టుల్లో అప్రమత్తత పెంచండి – జిల్లా ఎస్పీ ఆదేశాలు

📰 Generate e-Paper Clip

ఫజుల్‌నగర్ చెక్‌పోస్ట్‌పై ఎస్పీ ఆకస్మిక తనిఖీ
మన ప్రజా ప్రతినిధి – రాజన్నసిరిసిల్ల, నవంబర్ 28
గ్రామ పంచాయతి ఎన్నికల దృష్ట్యా జిల్లాలో శాంతిభద్రతలు భద్రంగా ఉండేందుకు ఫజుల్‌నగర్ చెక్‌పోస్ట్‌లో చేపడుతున్న తనిఖీలను జిల్లా ఎస్పీ ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. వాహనాల తనిఖీ ప్రక్రియను ప్రత్యక్షంగా గమనించిన ఎస్పీ, నమోదు రిజిస్టర్‌ను పరిశీలించి సిబ్బంది పని తీరును తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో అక్రమ రవాణా విస్తరిస్తుందనే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.ఓటర్ల కొనుగోలు ప్రయత్నాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ఎక్కడైనా డబ్బు, మద్యం లేదా ఇతర విలువైన వస్తువులు తరలిస్తున్నట్టు సమాచారం లభిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే లేదా శాంతిభద్రతలను భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఎస్పీ పర్యటనకు సి.ఐ శ్రీనివాస్, ఎస్‌.ఐ వెంకట్రాజం, చెక్‌పోస్ట్ సిబ్బంది హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular