📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలువివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

📰 Generate e-Paper Clip

ఉప సర్పంచ్ కందనూరి శ్రీనివాస్ గౌడ్
నర్సాపూర్,జనవరి12(మనప్రజాప్రతినిధి):
స్వామి వివేకానంద స్ఫూర్తి యువతను ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి ప్రేరేపించాలన్నారు ఉపసర్పంచ్ కందనూరి శ్రీనివాస్ గౌడ్.సోమవారం రామాయపల్లి పాఠశాలలో వివేకానంద జయంతి సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో, శ్రీనివాస్ గౌడ్ వివేకానంద చిత్రపటానికి పూలమాల అర్పించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత కేవలం చదువులోనే కాకుండా, క్రీడలు, సాంస్కృతిక, సామాజిక రంగాలలో నూ ప్రావీణ్యం చూపి, దేశ అభివృద్ధిలో తమవంతుగా భాగస్వామ్యం కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వర్షిత్ శివ గౌడ్, చరణ్ గౌడ్, రాఘవేంద్ర, మధు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular