📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుతిమ్మానగర్ 2వ వార్డు నుంచి కంబాల పోచమ్మ నామినేషన్ – గౌను గుర్తుకు క్రమసంఖ్య 1

తిమ్మానగర్ 2వ వార్డు నుంచి కంబాల పోచమ్మ నామినేషన్ – గౌను గుర్తుకు క్రమసంఖ్య 1

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//డిసెంబర్11
తిమ్మానగర్ గ్రామంలోని 2వ వార్డు సభ్యురాలిగా కంబాల పోచమ్మ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్‌లో క్రమసంఖ్య 1గా “గౌను గుర్తును” అధికారికంగా కేటాయించింది.ఈ సందర్భంగా కంబాల పోచమ్మ మాట్లాడుతూ“ప్రజలు నాపై ఉంచిన విశ్వాసం ఎంతో గొప్పది.నేను గెలిచి అవకాశం దక్కితే వార్డు అభివృద్ధికి అహర్నిశలు కష్టపడే సేవకురాలిగా పనిచేస్తాను.మన 2వ వార్డులో ఉన్న డ్రైనేజీ, పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలు ఏవైనావాటిని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ప్రజల అందుబాటులో ఉంటాను, బాధ్యతగా పనిచేస్తాను. గౌనుగుర్తు-క్రమసంఖ్య 1మీ అమూల్యమైన ఓటుతో నన్ను గెలిపించి అభివృద్ధి బాటలో నడిపించండి” అని ఆమె పేర్కొన్నారు.అలాగే“2వ వార్డు ప్రజలు నన్ను గెలిపిస్తారన్న నమ్మకానికి హృదయపూర్వక ధన్యవాదాలు.వచ్చే 5 సంవత్సరాలు మీ సేవలో నిబద్ధతతో పనిచేస్తాను.దయచేసి 2వ వార్డు ప్రజలు కంబాల పోచమ్మ అనే నన్ను గెలిపించండి.మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు,” అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular