📄 ePaper
Sunday, July 26, 2026
Homeఎడిటోరియల్ఎన్నికల స్టoట్ లో భాగమే కేసిఆర్ విచారణ

ఎన్నికల స్టoట్ లో భాగమే కేసిఆర్ విచారణ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 1:

మున్సిపల్ ఎన్నికల సందర్బంగా బిఆర్ఎస్ నాయకులను ఇరుకున పెట్టడానికి సిట్ విచారణ అని GMR ఫౌండేషన్ చైర్మన్,బిఆర్ఎస్ నాయకులు గుఱ్ఱపు మచ్చెందర్ అన్నారు.ఫోన్ ట్యాపింగ్ పేరుతో సిట్ విచారణ అంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును విచారణకు పిలవడాన్ని వ్యతిరేఖిస్తు సోమవారం నారాయణఖేడ్ లో గుర్రం మచ్చెందర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి రాజీవ్ చౌరస్తా వరకు పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCR,KTR లను విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడం సబబు కాదు అన్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని,
సాగునీరు,విద్యుత్, మౌలిక వసతులు, రైతు సంక్షేమం వంటి రంగాల్లో కేసీఆర్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రజలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్‌పై సిట్ విచారణల పేరుతో వేధింపులు చేస్తున్నారని ఆరోపించారు.ఇలాంటి చర్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని,పార్టీ అధిష్టానానికి బిఆర్ఎస్ కార్యకర్తలు అండదండగ ఉంటారని,ప్రాణాలను సైతం పణంగా పెడతాము అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, తుకారాం,గంగారాం, సత్యపాల్ రెడ్డి,రాజు నాయక్,శ్రీనివాస్, హర్షవర్ధన్,శంకర్, ఆకాశ్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular