📄 ePaper
Monday, July 27, 2026
Homeఆంధ్రప్రదేశ్గ్రామాల నిజాలను తెలుసుకునేందుకు ‘కీబోర్డ్ టు విలేజెస్’ ప్రారంభం

గ్రామాల నిజాలను తెలుసుకునేందుకు ‘కీబోర్డ్ టు విలేజెస్’ ప్రారంభం

📰 Generate e-Paper Clip

గ్రామాల వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ఐటీ వింగ్ ప్రత్యేక ప్రణాళిక
రైతులు, మహిళలు, యువతతో సహజ సంభాషణలు

శ్రీకాళహస్తి,జనవరి10(మనప్రజాప్రతినిధి):
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామస్థాయి ప్రజా అనుసంధాన కార్యక్రమం ‘కీబోర్డ్ టు విలేజెస్’ శ్రీకాళహస్తి మండలంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం జనవరి 10 నుండి 17వ తేదీ వరకు కొనసాగనుంది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సంక్రాంతి పండుగ సందర్భంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న కార్యకర్త లు తమ స్వగ్రామాలకు చేరుకునే సందర్భాన్ని ఉపయోగించుకొని, గ్రామాల వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది.ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు, మహిళలు, యువత, వృద్ధులు, చిన్న వ్యాపారులతో ఇళ్లు, పొలాలు, గ్రామ కూడళ్లలో సహజంగా జరిగే సంభాషణల ద్వారా-వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవి? ప్రస్తుతం ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అనే అంశాలపై ప్రజల నిజమైన అభిప్రాయాలను సేకరిస్తున్నారు.ఇవి ఎలాంటి ప్రణాళికబద్ధ సమావేశాలు కాకుండా, సహజంగా జరిగే మాటామంతీలు మాత్రమే. ఈ సంభాషణలను ఐటీ విభాగం సభ్యులు మొబైల్ ఫోన్లలో చిన్న వీడియోలుగా చిత్రీకరించి, ఎలాంటి మార్పులు లేకుండా సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నారు.
గ్రామాల నుంచి వచ్చిన నిజం నేరుగా ప్రజల ముందుకు చేరాలనే ఉద్దేశంతో, “వినడమే రాజకీయానికి పునాది” అన్న భావనను ఈ ‘కీబోర్డ్ టు విలేజెస్’ కార్యక్రమం మరోసారి గుర్తుచేస్తోంది.
ఇట్లు,
పొలం రెడ్డి భరత్ కుమార్
శ్రీకాళహస్తి నియోజకవర్గం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం అధ్యక్షుడు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular