📄 ePaper
Sunday, July 26, 2026
Homeఆంధ్రప్రదేశ్కేఆర్.(KR) సినీ ప్రొడక్షన్ ‘రుద్రవన’… ముహూర్తంతోనే ఆసక్తి నెలకొంది.

కేఆర్.(KR) సినీ ప్రొడక్షన్ ‘రుద్రవన’… ముహూర్తంతోనే ఆసక్తి నెలకొంది.

📰 Generate e-Paper Clip

కేఆర్ సినీ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కనున్న కొత్త సినిమా ‘రుద్రవన’ ముహూర్త కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా, ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర చేతుల మీదుగా మూవీ గ్లింప్స్‌ను అధికారికంగా లాంచ్ చేయడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.లాంచ్ అయిన గ్లింప్స్‌ను చూస్తే, మూవీ ప్రెజెంటేషన్‌లో కొత్తదనం, విజువల్ ఇంటెన్సిటీ, కథనంలో బలమైన హుక్ ఉండబోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో సినిమా ప్రారంభానికి ముందే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ ఏర్పడింది.
ఈ సందర్భంగా నిర్మాత కుమార్ CV మాట్లాడుతూ, సినిమా త్వరలోనే పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిపారు. దర్శకులు V. బాల మురళి నాయక్ & ఈశ్వర్ చల్లా మాట్లాడుతూ, ఈ చిత్రంలో హర్షిత్ శెట్టి హీరోగా,మాణికరాజ్ హీరోయిన్‌గా నటిస్తున్నారని వెల్లడించారు. అలాగే, సినిమా మార్చి నెలలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.ఈ చిత్రానికి సంతోష్ & శివగంగా కో-డైరెక్టర్లుగా వ్యవహరిస్తుండగా, సినిమా‌కు సంబంధించిన ఇతర కీలక అంశాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లుచిత్రబృందం వెల్లడించింది.ముహూర్తంతోనే మంచి స్పందన తెచ్చుకున్న ‘రుద్రవన’పై, చిత్రబృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

రుద్రవన” జనావరణంలోకి విస్తరిస్తూ…
•ఉద్యానవనంలా ఆహ్లాదాన్ని పంచుతూ…
•మంచి నటనతో నవరసాలను పండిస్తూ…
•పండంటి కళామతల్లి బిడ్డలుగా చిత్రబృందం ఎదగాలని ఆకాంక్షిస్తూ…
ప్రేక్షకాధరణతో ఘన విజయం సాధించి,
•ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా
•‘రుద్రవన’చిత్రబృందానికి హృదయపూర్వకశుభాకాంక్షలు.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular