📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణ5గంటల నుండి మద్యం దుకాణాల మూసివేత

5గంటల నుండి మద్యం దుకాణాల మూసివేత

📰 Generate e-Paper Clip

ఎక్సైజ్ సిఐ రఘునాథ్ రెడ్డి

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 9: సోమవారం సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తాలూకా వ్యాప్తంగా గల మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ సిఐ రఘునాథ్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5లకు ముగుస్తుందని, పోలింగ్ కు 48 గంటల ముందు అనగా 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నారాయణఖేడ్ డివిజన్ వ్యాప్తంగా గల మద్యం దుఖానాలు మూసివేయాలన్నారు. నేటి సాయంత్రం 5 తర్వాత ఎక్కడైనా మద్యం దుకాణాలు తెరిచిన,బెల్టు దుకాణాలలో మద్యం అమ్మిన 8712658915 సిఐ రఘునాథ్ రెడ్డి తన నంబర్ కు సమాచారం ఇవ్వాలి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular