📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురాష్ట్రస్థాయికి మహర్షి హైస్కూల్ విద్యార్థినులు

రాష్ట్రస్థాయికి మహర్షి హైస్కూల్ విద్యార్థినులు

📰 Generate e-Paper Clip

•జిల్లాజట్టులోచోటుసంపాదించిరాష్ట్రస్థాయికిఅర్హత
•పట్టుదలతోవిజయపథంలోఅడుగులువేసినబాలికలు
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.ఫిబ్రవరి18
మహర్షి హైస్కూల్ విద్యార్థినులు క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి అండర్-16 బాలికల ఫుట్‌బాల్ పోటీలలో అద్భుత ప్రదర్శనతో సుకృత, శ్రీనిక, హాసిని, ఉపాసనలు జిల్లా జట్టులో స్థానం సంపాదించడంతో పాటు రాష్ట్రస్థాయిలో ఆడేందుకు అర్హత సాధించారు.మైదానంలో పట్టుదల, సమన్వయం, జట్టు స్పూర్తితో ఆడిన విద్యార్థినులు ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చాటుతూ విజయం సాధించారు. వారి కృషి పాఠశాలకు గౌరవాన్ని తెచ్చింది.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బూర శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శ్వేత విద్యార్థినులను అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమని, రాష్ట్రస్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థినుల విజయానికి సహకరించిన వ్యాయామ ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular