📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుచేర్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పల్లా

చేర్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పల్లా

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//చేర్యాల. డిసెంబర్ 2
చేర్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకెసిఆర్ పదేళ్ల పాలనలో పింఛన్లు 200 నుండి 2000కి పెంపు, కళ్యాణ లక్ష్మి–షాదీ ముభారక్ ద్వారా ఆర్థికసహాయం, సంవత్సరానికి 10 వేలరూపాయల రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆయన“ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేర్చారా? రైతు బంధు పెంపు, మహిళా భృతి, పింఛన్లు—ఏది కనిపించడం లేదు,” అని ప్రశ్నించారు.
ప్రతిగ్రామంలో కెసిఆర్ పాలన–రెవంత్ పాలన మధ్య తేడా ప్రజలకు వివరించాలని సూచించారు.తన నియోజకవర్గ ప్రజలకు నీలిమ హాస్పిటల్‌లో ఉచిత వైద్యం మరో మూడు సంవత్సరాలు కొనసాగుతుందని తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్, భాజపా నుంచి పలువురు నాయకులు బీఆర్ఎస్‌లో చేరగా, ఎమ్మెల్యే పల్లా వారికి కండువా కప్పి ఆహ్వానం పలికారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular