📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిపిఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర కేక్ కట్ కార్యక్రమం

సిపిఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర కేక్ కట్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

సదాశివపేట,జనవరి1(మనప్రజాప్రతినిధి):
సదాశివపేటలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సిపిఐ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. తాజుద్దీన్ నూతన సంవత్సర కేక్‌ను కట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘ నాయకులు అందరూ ఆరోగ్యంగా, ఆయుష్షుతో బాగుండాలని, నూతన సంవత్సరం మన అందరికీ శుభకరంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం చేసిన పోరాటాలు ఫలించాలని, రాబోయే రోజుల్లో మరింత బలంగా ప్రజా ఉద్యమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లాభాలు పొందే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ మతోన్మాద ధోరణుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సోదరభావంతో కలిసిమెలిసి జీవించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి. షఫీ, మండల కార్యదర్శి పాండు,ఎం. రమేష్, సాదిక్ అలీ, ముస్తఫా, యాకూబ్, అడ్వకేట్ ప్రభాకర్, గంగమ్మ, రాజమ్మ, లడ్డు లక్ష్మి, జ్యోతి, దేవిబాయి, బి. పాషా, శివలీల, శాంతాభాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular