📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుహిందూ దేవుళ్లను అవమానించే ధైర్యం ఎవరికి ఉండకూడదు : దుమాల శ్రీకాంత్

హిందూ దేవుళ్లను అవమానించే ధైర్యం ఎవరికి ఉండకూడదు : దుమాల శ్రీకాంత్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి// రాజన్న సిరిసిల్ల జిల్లా.డిసెంబర్ 03

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణ బిజెపి అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ,“హిందూ దేవుళ్లను అవమానించే ధైర్యం ఎవరికి ఉండకూడదు” అని హెచ్చరించారు. గతంలో స్థానిక శాసనసభ్యుడు, మాజీ మంత్రి KTR దేవుళ్లను నమ్మని వ్యక్తిని హనుమాన్ స్వాముల ఆశ్రమంలో కూర్చోబెట్టి జపం చేయించిన ఘనత కూడా బిజెపీకే దక్కిందని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తే హిందూ భావాలను దెబ్బతీసేలా మాట్లాడడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు.హిందూ సమాజం శాంతిని కోరుకునేదేకానీఅవమానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని అన్నారు.
ఇకపై ఎవరివద్దనైనా హిందూ దేవుళ్లపై అవమానకర వ్యాఖ్యలు వెలువడితే బిజెపి తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని,పార్టీ నిశ్శబ్దంగా ఉండదని శ్రీకాంత్ స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మ్యాన రామ్ ప్రసాద్, సీనియర్ నాయకులు గూడూరి భాస్కర్, పట్టణ ఉపాధ్యక్షులు మోర శ్రీహరి, అంకారపు రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, కొండ నరేష్, అధికార ప్రతినిధులు మోర రవి, చొప్పదండి శ్రీనివాస్, దూడం సురేష్, సూరం వినయ్, చొక్కి శ్రీనివాస్, రచ్చ రాహుల్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular