📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమాజీ నక్సలైట్ దారుణ హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

మాజీ నక్సలైట్ దారుణ హత్య
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

📰 Generate e-Paper Clip

మన ప్రజాప్రతినిధి – రాజన్న సిరిసిల్ల
నవంబర్ 28

రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేట గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ బల్లెపు నరసయ్య అలియాస్ సిద్దయ్యఅలియాస్ బాపురెడ్డి దారుణ హత్యకు గురైన ఘటనపైవేములవాడపట్టణపోలీసులుకేసునమోదుచేసినట్టుతెలిపారు.మృతుడుగతంలో పీపుల్స్ వార్ దళంలోపనిచేసినట్టువెల్లడించారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం—నరసయ్యను యూట్యూబ్ ఇంటర్వ్యూ కోసం రావాలని జగిత్యాల నివాసి జక్కుల సంతోష్ ఫోన్ చేయడంతో ఆయన తన ఇంటి నుండి బయలుదేరినట్లు చెప్పారు. అనంతరం అగ్రహారం సమీపంలోని గుట్టల వద్ద రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.మృతుడి కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో జక్కుల సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్టు వేములవాడ పట్టణ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular