📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణపారదర్శక పాలన కోసమే ప్రజావాణి,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్

పారదర్శక పాలన కోసమే ప్రజావాణి,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్

📰 Generate e-Paper Clip


మెదక్//మనప్రజాప్రతినిధి నవంబర్17:

పారదర్శక పాలన కోసం ప్రజావాణి కార్యక్రమాన్నీ నిహస్తున్నామని,ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
సోమవారం ప్రజావాణి కార్యాలయానికి జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచి ప్రజలు వచ్చి నేరుగా దరఖాస్తులు సమర్పించారు.ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మొత్తం 76 దరఖాస్తులు జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అందులో భూ భారతి 36,ఇందిరమ్మ ఇండ్లు8,పింఛన్లు7, ఇతర 25 ,తో మొత్తం 76 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
స్వీకరించిన దరఖాస్తులను త్వరిత గతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు డిఆర్ఓ భుజంగరావు,జిల్లాఅధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular