📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రజాసేవే లక్ష్యం-గ్రామీణ అభివృద్ధికే తొలి ప్రాధాన్యంఆరూరు గ్రామ సర్పంచ్‌గా నాయి కోటి లావణ్య మధు ప్రమాణ...

ప్రజాసేవే లక్ష్యం-గ్రామీణ అభివృద్ధికే తొలి ప్రాధాన్యంఆరూరు గ్రామ సర్పంచ్‌గా నాయి కోటి లావణ్య మధు ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

సదాశివపేట,డిసెంబర్22(మనప్రజాప్రతినిధి):
సదాశివపేట మండలంలోని ఆరూరు గ్రామంలో సోమవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నాయి కోటి లావణ్య మధు ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసేవే తన ప్రధాన లక్ష్యమని, గ్రామీణ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.అనంతరం ఉపసర్పంచ్‌గా మ్యాదరి విట్టల్‌తో పాటు వార్డు సభ్యులు దానయ్య గారి భరత్ కుమార్, బొబ్బిలిగామ భాగ్యలక్ష్మి, టేకూరి అంజయ్య, మన్నే నాగేష్, తుమ్మలపల్లి భారతమ్మ, మన్నే రమేష్ కుమార్, నాగేష్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం గ్రామ పెద్దలు నూతన పాలకవర్గాన్ని పూలమాలలు వేసి, శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు, స్థానిక నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular