📄 ePaper
Monday, July 27, 2026
Homeఆంధ్రప్రదేశ్విద్యార్థులకు అన్ని మౌళిక సదుపాయాలు కల్పించాలి: కమిషనర్ మౌర్య..

విద్యార్థులకు అన్ని మౌళిక సదుపాయాలు కల్పించాలి: కమిషనర్ మౌర్య..

📰 Generate e-Paper Clip

•“ఫ్లోరింగ్ నుంచి అంగన్వాడీ సౌకర్యాల వరకు… విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచి కమిషనర్ మౌర్య కీలక ఆదేశాలు

తిరుపతి,జనవరి19(మనప్రజాప్రతినిధి)
నగరంలోని కర్ణాల వీధి మునిసిపల్ స్కూల్‌లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలు కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధికారులు ఆదేశించారు.సోమవారం సాయంత్రం, కార్పొరేటర్ నరసింహ ఆచారి, ఇతర అధికారులు కలిసి స్కూల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ:
తరగతి గదుల్లో ఫ్లోరింగ్ కోసం టైల్స్ ఏర్పాటు చేయాలి.అప్పర్ బ్రిడ్జ్‌లో అసంపూర్ణంగా ఉన్న పనులను పూర్తిచేయాలి.ఇరుకుగా ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తగిన ఏర్పాట్లు చేయాలి.పక్కన ఉన్న మస్టర్ కేంద్రంలోని నిరుపయోగ వస్తువులను శుభ్రం చేసి విద్యార్థులకు ఇబ్బంది రాకుండా చూడాలి.కమిషనర్ సూచనల ప్రకారంఇంజినీరింగ్ అధికారులు తక్షణమే ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఆదేశాలు పొందారు. కమిషనర్‌తో సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసికుమార్, డి.ఇ.లు రాజు, లలిత, మరియు శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular