📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుతాటిపాముల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

తాటిపాముల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

📰 Generate e-Paper Clip

తిరుమలగిరిమండలం తాటిపాముల గ్రామంలో సర్పంచ్ పదవికిBRS పార్టీ తరపున ఐల ఉపేందర్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం తొండ ఎన్నికల క్లస్టర్ ఆఫీసులో నవంబర్ 29, 2025న జరిగింది. పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువతపెద్దసంఖ్యలోహాజరైమద్దతుతెలిపారు.అభ్యర్థివాగ్దానాలునామినేషన్ సమర్పణ తర్వాత మాట్లాడిన ఐల ఉపేందర్ గ్రామ అభివృద్ధి కోసం సంకల్పంతో ముందుకు వస్తున్నానని, ప్రజలతో అడుగడుగునా ఉంటానని పేర్కొన్నారు. తాటిపాముల గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం తన స్వప్నమని, పక్షపాతం లేకుండా ప్రతి కుటుంబానికి సేవ చేయడంముఖ్యలక్ష్యమనిచెప్పారు.త్రాగునీరు, రహదారులు, డ్రైనేజ్, విద్యుత్ వ్యవస్థలపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశానని, ప్రాథమిక వసతులు ప్రతి ఇంటికీ చేరేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజల మద్దతుతో అవకాశం దొరికితే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చడానికి వెనుకడుగు వేయనని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular