📄 ePaper
Tuesday, July 28, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుయువతి ఆత్మహత్య ఘటన

యువతి ఆత్మహత్య ఘటన

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం(కుకునూర్ పల్లి)డిసెంబర్ 3
కుకునూరు పల్లి గ్రామానికి చెందిన శంకర్ మేస్త్రీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. శంకర్‌కు ఒక కుమారుడు, కుమార్తె శ్రావణి (18) ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన శ్రావణి కుటుంబ పరిస్థితుల వల్ల ఇంటి దగ్గరే ఉండి కూలికే వెళ్లేది.
శంకర్ కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వారు తరచూ దౌల్తాబాద్ మండలం మల్లేశంపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మహేష్ అలియాస్ రసీం బాబాను సంప్రదించేవారు. ఈ సందర్భంగా శ్రావణికి మహేష్‌తో పరిచయం ఏర్పడి, అది క్రమంగా ప్రేమగా మారింది.కొన్ని రోజుల క్రితం మహేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత శ్రావణి మానసికంగా చాలా కుంగిపోయి, ఇంట్లో సరిగా తినకపోవడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. కారణం ఏమిటని అడగగా మహేష్‌ను ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నానని ఆమె తెలిపినట్లు కుటుంబసభ్యులు చెప్పారు ప్రేమించిన వ్యక్తి మృతి చెందడంతో మనస్తాపానికి గురైన శ్రావణి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. తక్షణమే గమనించిన కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే శ్రావణి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై కుకునూరు పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular