“మందులు, వైద్య పరికరాలు, రికార్డులు పరిశీలించిన జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటజిల్లా-కొండపాకమండలం.జూలై17
కొండపాక మండల కేంద్రంలో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్‌ను గురువారం 108 అత్యవసర సేవల ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ అంబులెన్స్‌లోని మందులు, వైద్య పరికరాలు, వాటి నిల్వలు, నిర్వహణ విధానం, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణులను ప్రసవ సమయాల్లో సకాలంలో ఆస్పత్రికి తరలించేందుకు క్షేత్రస్థాయి వైద్య సిబ్బందితో సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించిన ఆయన, రికార్డుల నిర్వహణ, సేవల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందిని అభినందించారు.
ఈ తనిఖీలో ఈఎంటీలు లక్ష్మణ్, మహేందర్‌తో పాటు అంబులెన్స్ పైలెట్లు శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.
కొండపాకలో 108 అంబులెన్స్‌పై ఆకస్మిక తనిఖీ
RELATED ARTICLES


