📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు5 రోజుల పనిదినాలు వెంటనే అమలు చేయాలి

5 రోజుల పనిదినాలు వెంటనే అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

దేశవ్యాప్తంగా బ్యాంకు సమ్మె – UFBU ఘాటు హెచ్చరిక
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి27
బ్యాంకు ఉద్యోగులకు తక్షణమే 5 రోజుల పనివారపు విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది.
గతంలో కుదిరిన ఒప్పందాలను ప్రభుత్వం గౌరవించకుండా జాప్యం చేయడం తగదని యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశాయి.LIC, RBI వంటి సంస్థల్లో ఇప్పటికే 5 రోజుల పని విధానం అమల్లో ఉండగా, బ్యాంకుల విషయంలో మాత్రం వివక్ష చూపడం అన్యాయమని UFBU నేతలు మండిపడ్డారు.ఈ సమ్మె ప్రభావంతో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, కౌంటర్ సేవలు పూర్తిగా స్తంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తూ దీర్ఘకాలిక సమ్మెకు సిద్ధమవుతామని బ్యాంకు ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular