📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకంబాలపల్లిలోఘనంగాతొట్టెలకార్యక్రమంహాజరైనసంగారెడ్డిఎమ్మెల్యేతనయుడుచింతాసాయినాథ్

కంబాలపల్లిలోఘనంగాతొట్టెలకార్యక్రమంహాజరైనసంగారెడ్డిఎమ్మెల్యేతనయుడుచింతాసాయినాథ్

📰 Generate e-Paper Clip

సదాశివపేట,డిసెంబర్17(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెద్ద గొల్ల శ్రీహరి-కరుణశ్రీ దంపతుల రెండవ కుమార్తె తొట్టెల కార్యక్రమం ఆదివారం సంప్రదాయబద్ధంగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి తనయుడు చింతా సాయినాథ్ గారు హాజరై చిన్నారికి ఆశీస్సులు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీహరి–కరుణశ్రీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సంప్రదాయ విలువలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ తొట్టెల కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెద్ద గొల్ల మల్లమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, వార్డు సభ్యులు ఖలీల్, అనసూయ,బాబు, రవీందర్ రెడ్డి, కిషోర్, వెంకటేశం, యాదయ్య, అశోక్, శ్రీశైలం, మల్లేశం, పాండు, జానీ మియా తదితర గ్రామ నాయకులు, ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular