📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణవైభవంగా శివ స్వాముల శోభాయాత్ర

వైభవంగా శివ స్వాముల శోభాయాత్ర

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి //నారాయణఖేడ్ జనవరి 28:

నారాయణఖేడ్ పట్టణంలో గురు స్వాములు,శివ స్వాములు బుధవారం శోభాయాత్రను నిర్వహించారు.పట్టణంలోని మంగళ పేట్ భవాని ఆలయం నుండి రాజీవ్ గాంధీ,బసవేశ్వర మరియు శివాజీ చౌక్ ల మీదుగా చారిత్రాత్మకమైన కాశీనాథ ఆలయం వరకు శోభాయాత్ర కొనసాగింది.ఈ సందర్భంగా గురుస్వాములు,శివ స్వాములు మాట్లాడుతూ.. ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నారు. హిందూ హైందవ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరు ముందుండాలన్నారు. అనంతరం కాశీనాథ్ ఆలయంలో కాశీ విశ్వేశ్వరునికి జలాభిషేకం నిర్వహించి స్వామీజీల ప్రవచనాలు విన్నారు.ఈ కార్యక్రమంలో గురురాజు శర్మ,వెంకటేష్ పంతులు నారాయణఖేడ్ నియోజకవర్గ వివిధ మండలాల గురు స్వాములు,శివ స్వాములు,కన్నె స్వాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular