📄 ePaper
Sunday, July 26, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఅంకెనపల్లి గ్రామంలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

అంకెనపల్లి గ్రామంలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip


సదాశివపేట.డిసెంబర్22(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట మండలం అంకెనపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన వార్డు సభ్యులను గ్రామ కాంగ్రెస్ శ్రేణులు శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నూతన వార్డు సభ్యులు అవినాష్, తుల్జరం, భాగమ్మ, సంతోషమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గ్రామాభివృద్ధికి అంకితభావంతో పని చేస్తామని వారు తెలిపారు.ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు సంగమేశ్వర్, దావీదు, చంద్రప్ప, నర్సింలు, మల్లేశం, శేఖర్, ప్రవీణ్, నర్సింహ రాజు, రచన్న, రమేష్, మహేష్ పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ పాలనను పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular